KNR: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో పలు అంశాలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2021 ఫిబ్రవరి నుంచి 27 వేల 580 దరఖాస్తులు రాగా 1810 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అన్నారు.