KRNL: డిగ్రీ ప్రథమ సంవత్సర అడ్మిషన్లను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆదోని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ PDSO ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాలు నాలుగు నెలల క్రితమే విడుదల అయినప్పటికీ డిగ్రీ ప్రవేశాలు ఇంకా పూర్తి కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అడ్మిషన్లు చేపట్టాలని ఆకాంక్షించారు.