SRD: కొండాపూర్ మండలంలో ఆర్ఆర్ఆర్ కింద భూసేకరణ నిలిపివేయాలని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులు మాజీ మంత్రి హరీష్ రావుకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఆర్ఆర్ఆర్ కింద తమ భూములు తీసుకుంటే ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అలైన్మెంట్ మార్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.