ATP: సంచార జాతులను భారత రాజ్యాంగంలో చేర్చి 10% రిజర్వేషన్లు కల్పించాలని రాయదుర్గం ఎన్జీవో భవనంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంచార జాతి కార్యదర్శి జి. గంగాధర్ మాట్లాడుతూ.. తమపై జరుగుతున్న హింసను అరికట్టడానికి రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంచార జాతుల ప్రతినిధులు పాల్గొన్నారు.