JN: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా -హీ సేవ 2025 – స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సంబంధిత వాల్ పోస్టర్ను ఆవిష్కరించి వారు మాట్లాడారు. శ్రమదానం, చెత్త తొలగింపు, స్వచ్ఛతా ర్యాలీలు వంటి కార్యక్రమాలు చేయనున్నారు.