SKLM: పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై శ్రద్ద వహించి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని జిల్లా ఎస్పీ కెవి.మహేశ్వర రెడ్డి కోరారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డు జి. తిరుపతి రావుకు ఎస్పీ ప్రశంసా పత్రాన్ని అందజేసి హోంగార్డు సేవలను కొనియాడారు. సుదీర్ఘంగా హోంగార్డుగా విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేయడం అభినందనీయమని ఎస్పీ అన్నారు.