NZB: పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి గెలుపొందారు. ఆయన ప్యానెల్‌లోని 11 మంది అభ్యర్థులు విజయం సాదించారు. ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఓటర్లు పాల్గొన్నారు. నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 85 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 884 ఓట్లకు 767 ఓట్లు పోలయ్యాయి.