AP: రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. రూ.2000 కోట్ల వరకు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడంతో నెలవారీ నిర్వహణకు ఇబ్బంది అవుతుందని తెలిపారు.