MDK: కౌడిపల్లి మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా పక్షం మండల కార్యశాల నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మండల పరిధిలోని బూత్ అధ్యక్షులు హాజరయ్యారు. సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా 15 రోజులపాటు నిర్వహించనున్న సేవా కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.