VZM: తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పదోవార్డు కౌన్సిలర్ నరవ రామలక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చులకనగా చూస్తున్నారని ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. వార్డులో తనకు తెలియకుండా అభివృద్ధి పనులు నగరపంచాయతీ టీడీపీ నాయకులు చేస్తున్నారని ఆవేదనలో ఉన్నట్లు సమాచారం.