MDK: నిజాంపేటలో శనివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మట బాబు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం నిర్వహించామన్నారు. బీసీ రిజర్వేషన్‌కు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.