KNR: స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శనివారం కరీంనగర్లోని ఎన్టీఆర్ బైపాస్ వద్ద ఘనంగా నిర్వహించారు. సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.