MHBD: విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తి గల SC విద్యార్థులు నవంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC అభివృద్ధి అధికారి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు రూ. 20 లక్షలు ఉపకార వేతనం అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.