VZM: అసెంబ్లీలో నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.