TG: బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేశారని, పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారని ప్రశ్నించింది. అయితే, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40% కోటా రాజ్యాంగ విరుద్ధమని, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.