GDWL: గద్వాలలోని తేరు మైదానంలో గురువారం సాయంత్రం 5 గంటలకు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మహిళలు, చిన్నారులు, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఆకర్షణీయంగా బతుకమ్మను పేర్చిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని ఆయన తెలిపారు.