CTR: చౌకదుకాణాల ద్వారా బియ్యం కార్డుదారులకు సెప్టెంబరు నెల కోటా నిత్యావసర సరకుల పంపిణీ గడువు సోమవారంతో ముగియనుంది. జిల్లాలో 5,34,721 బియ్యం కార్డులుండగా.. ఇప్పటివరకు 4,89,054 కార్డులకు సరకులు అందజేసినట్లు చెప్పారు. 91.46 శాతం పూర్తి చేసినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శంకరన్ తెలిపారు. 100 శాతం పంపిణీకి డీలర్లు కృషి చేయాలని ఆయన తెలిపారు.