SDPT: జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైసెన్స్డ్ సర్వేయర్ల సప్లిమెంటరీ పరీక్షలను పర్యవేక్షించారు. రెండు నెలల శిక్షణ అనంతరం సర్వేయర్లుగా ఎంపికైన అభ్యర్థులు పరీక్షలు రాశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఆమె పేర్కొన్నారు.