అన్నమయ్య: జిల్లా నూతన ఎస్పీగా నేడు ధీరజ్ కునుబిల్లి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలలో భాగంగా ఇంతకుముందు ఎస్పీగా ఉన్న విద్యాసాగర్ నాయుడు కృష్ణ జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ధీరజ్ కునుబిల్లి బాధ్యతలు స్వీకరించారు.