PLD: అమరావతి మండలం ధరణికోట జైల్ సింగ్ కాలనీలోని 11వ రేషన్ షాపులో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా లబ్ధిదారుల ఫొటోలతో కూడిన ఈ స్మార్ట్ కార్డులను అందజేయడం కూటమి ప్రభుత్వం పారదర్శకతకు నిదర్శనమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డానియల్ పాల్గొన్నారు.