AKP: కొక్కిరాపల్లి జంక్షన్ నుంచి జాతీయ రహదారి మీదుగా వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్యతో ఐదు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు 23వ వార్డు కౌన్సిలర్ రామకృష్ణ తెలిపారు. కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద కొక్కిరాపల్లి, అగ్రహారం, వెంకటాపురం, నవాబుపేట, చిన్న గొల్లలపాలెం వెళ్ళేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్నారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.