GNTR: సీఎం చంద్రబాబు చేపట్టిన పీ-4 అంటే కేవలం డబ్బులివ్వడం కాదని, అదొక సామాజిక బాధ్యత అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. పీ-4 అమలులో ‘సవాళ్లు-పరిష్కారాలు’ అనే అంశంపై గుంటూరు క్లబ్లో ఆదివారం జరిగిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే బూర్ల రాజాంజనేయులు, స్వర్ణాంధ్ర సాధన కమిటీ ఛైర్మన్ కుటుంబరావుతో కలిసి నసీర్ పాల్గొన్నారు.