NZB: భారీవర్షాలతో శ్రీరాంసాగర్ బ్యాక్వాటర్లో ఇళ్లు, పొలాలు నీట మునిగి నష్టపోయిన వరద బాధితులకు పరిహారం చెల్లించాలని బీజేపీ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా సోయా, వరి, పత్తి పంటలు 90 శాతం నష్టపోయాయన్నారు.