సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరోపై అక్రమంగా కేసు పెట్టడం అన్యాయం అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదన్నారు.