KNR: చిగురుమామిడిలోని పాంబండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని తమకే కేటాయించాలని దళితులు నిరసన తెలిపారు. 840, 841 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని, నిరుపేదలైన, ఇళ్లు లేని దళితులకు భూములు కేటాయించాలని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న దళితులతో మాట్లాడారు.