ADB: ఉపాధి కోసం ఆదిలాబాద్‌కు వచ్చిన వ్యక్తి ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో రైల్వే స్టేషన్లో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుబీర్ మండలం సిరిపెల్లి తండాకు చెందిన శివరాం (35) కూలీ పనుల కోసం తన భార్య, పిల్లలతో కలిసి ADBకు వచ్చాడు. ఆదివారం రాత్రి తిరిగి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్లాట్‌ఫామ్‌పై పడుకుని అక్కడే మరణించాడు.