అన్నమయ్య: మదనపల్లె మండలం, దొనబైలు కు రోడ్డు వేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు వినతి పత్రం అందజేశారు. రోడ్డు సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు అంతా బురదమయం అవుతుందని తెలిపారు.దీంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఇందుకు ఎమ్మెల్యే రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు.