JGL: మల్యాల మండలం కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మండలంలో మొత్తం ఓటర్లు 40,307 ఉండగా, ఇందులో పురుషులు 19,150, మహిళలు 21,155, ఇతరులు 2 మంది ఉన్నట్లు మండల అధికారులు ప్రకటించారు. మండలంలో అత్యధికంగా మల్యాలలో 9,978 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా గొర్రెగుండం గ్రామంలో 261 మంది ఓటర్లు ఉన్నారు.