NDL: కౌతాళం మండలంలోని గొతులదొడ్డి – కుంబళనూరు క్యాంపు-1 మధ్య నల్లవంక వద్ద వరి బస్తాలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. కల్వర్టు వర్షానికి కోతకు గురై అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. మండలంలోని రోడ్లు గుంతలతో ప్రమాదకరంగా మారాయని, శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.