KMM: ఖమ్మంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.45 వేల నగదును స్వాధీనం చేసుకొని వారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.