E.G: రాజమండ్రి రూరల్ మండలం జాంపేటలో ఆదివారం రాత్రి జరిగిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం అభినందన సభకు రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి విజయానికి అంకిత భావంతో పని చేసిన వారిని గుర్తించామన్నారు. సేవ చేసే వారికే దేవస్థానాల్లో స్థానం కల్పించడం జరుగుతుందన్నారు.