KDP: ఆధునిక యుగంలో మరొక విశ్వకర్మ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఇవాళ వేంపల్లి రహదారులు భవనముల అతిథి గృహము ఆవరణంలో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత దేశ నిర్మాణ రంగంలో గొప్ప పాత్ర పోషించిన ఘనత వారికి దక్కుతుందన్నారు.