NLR: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఏకే నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో సోమవారం పర్యటించారు. చెత్త తరలింపు వాహనం కంపాక్టర్ పనితీరును కమిషనర్ పరిశీలించారు. వాటర్ ట్యాంక్ ప్రాంగణంలో వ్యర్ధాలను పరిశుభ్రం చేయాలని శానిటేషన్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు.