ఖమ్మం జడ్పీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం జర్నలిస్టు సంఘాలు, వీడియో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. రిపోర్టర్ సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడమేనని వారు విమర్శించారు. కేసులు ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.