VSP: వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ప్రియాంక దండి డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలో మాట్లాడుతూ.. పీపీపీ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. రాజకీయంగా వైసీపీతో విభేదిస్తామని, మంచి పనులను స్వాగతిస్తామన్నారు.