ASR: డుంబ్రిగుడ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఓ కిరాణా దుకాణం చోరీకి గురైంది. గ్రామానికి చెందిన శెట్టి మల్లేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ఈ దుకాణంలో గుర్తుతెలియని దుండగులు తలుపులు పగలగొట్టి ప్రవేశించి వస్తువులను అపహరించారు. బాధితుడు స్థానిక పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.