సంగారెడ్డి: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ హేమంత్ కుమార్ తెలిపారు. నేడు సిర్గాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరవగా ప్రజలు విన్నవించిన సమస్యలపై చర్చించారు. ఇందులో MEO నాగారం శ్రీనివాస్, AO హరికృష్ణ, SI నారాయణ, డా. జెస్సి ఉన్నారు.