VZM: వేపాడ ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 17 న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ సోమవారం తెలిపారు. ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు అధ్యక్షతన జరగనున్న సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. అలాగే మండలంలోని 29 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు హాజరు కావాలని కోరారు.