TG: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమకొండలో తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ అయ్యారు. పాదయాత్ర నేపథ్యంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కుర్చపల్లి నుంచి ఆయన పాదయాత్ర చేయనున్నారు. అయితే, నిన్న కడియంపై తాటికొండ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు.