PLD: గతంలో జిల్లాలో పనిచేసిన ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్ల (CI)పై సస్పెన్షన్ వేటు పడింది. 2022 జూన్ 3న దుర్గి (M) జంగమేశ్వరపాడుకు చెందిన TDP నేత జల్లయ్య హత్య కేసులో నిందితులను వదిలేసి, బాధితుల బంధువులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారనే ఆరోపణలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ రుజువు అవ్వడంతో వారిద్దనీ సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.