అన్నమయ్య: కె.వి.పల్లి మండలం తిమ్మాపురం క్రాస్ సమీపంలోని తిమ్మాపురం మిట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు – కలకడ రహదారిపై ఆగి ఉన్న బొలెరోను బైక్‌తో అదే గ్రామానికి చెందిన జి. కృష్ణమూర్తి (55) ఢీకొట్టాడు. దీంతో ఆయన తల, చేయి, కాలికి తీవ్ర గాయాలు కావడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ తిరుపతికి తరలించారు.