BDK: కొత్తగూడెంలోని ఓపెన్ కాస్ట్ రహదారిపై తల్లి వానరం చనిపోయి పడి ఉండగా, దాని పిల్లి వానరం మూగ రోదన అంతా ఇంతా కాదు. తన తల్లిని లేపేందుకు ‘కిచ్.. కిచ్..’ అంటూ విలపిస్తూ, నిద్ర లేపడానికి ప్రయత్నించింది. అటు ఇటు తిరుగుతూ తల నిమురుతూ పొట్టపై పడుకొని తన తల్లి ఎందుకు లేవడం లేదంటూ రోధిస్తున్న తీరు అక్కడ ఉన్న అందరి హృదయాలను కలచివేసింది.