TPT: పాకాల మండలం మూలవంక అడవిలో ఆదివారం మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. మృతులను తమిళ్నాడు తంజావూరుకు చెందిన కలైసెల్వన్ (38) కుటుంబంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేక సైకాలజిస్ట్ డాక్టర్ వద్ద పరీక్షించుకున్న ప్రిస్క్రిప్షన్ ఘటన స్థలంలో లభ్యమైంది. పిల్లలను చంపి పూడ్చిన తర్వాత దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.