MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని పామాపురంలో ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణ పథకాలు పారదర్శకంగా, వేగంగా అమలవుతాయని ఆయన హామీ ఇచ్చారు.