MLG: తాడ్వాయి మండలం మేడారం అడవి మార్గంలో కొత్త రోడ్లు నిర్మిస్తామని మంత్రి సీతక్క తెలియజేశారు.ఇందులో కొండపర్తి-గోనెపల్లి-ముత్తాపురం, కాల్వపల్లి-కన్నెపల్లి, కాల్వపల్లి-ఊరట్టం మార్గాల్లో బీటీ రోడ్లు వేస్తున్నామన్నారు. ఛత్తీస్గడ్, ఖమ్మం నుంచి వచ్చే భక్తులకు చిన్నబోయినపల్లి మీదుగా రహదారి, రూ.16.5 కోట్లతో కొండాయి బ్రిడ్జి మహాజాతరలోపు పూర్తి చేస్తామన్నారు.