ATP: జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, MLA, MLC, ZPTC, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు హాజరవుతారన్నారు. గత సమావేశంలో చర్చించిన సమస్యలు పరిష్కారం కాలేదని.. ఈ సమావేశంలో సమస్యలు పరిష్కారం అవుతాయా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.