MLG: వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన భూపతి దీక్షిత్ (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నెల 13న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో బాధిత కుటుంబానికి న్యాయం లభించింది. గో డిజిట్ ఇన్సూరెన్స్ నుంచి కోటిన్నర పరిహారం కోరుతూ కుటుంబం కేసు వేసింది. శనివారం జరిగిన లోక్ అదాలత్లో జడ్జి బాధిత కుటుంబానికి అనుకూలంగా రూ.కోటి పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు.