మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కేంద్రంగా భారీ కుంభకోణం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూత్పూర్ చించోలి రోడ్డు విస్తరణలో భాగంగా భూ సేకరణ చేపట్టిన ఉదంతంలో రూ.30 లక్షల విలువ చేసే భూమికి దాదాపు రూ.3 కోట్లు ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అదే అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలోనే కుంభకోణానికి పాల్పడిన వారు ఉండడం గమనార్హం.