SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టుకు 642 క్యూసెక్కుల సల్ప వరద కొనసాగుతున్నదని ప్రాజెక్టు AE శ్రీవర్ధన్ రెడ్డి సోమవారం తెలిపారు. అయితే అలుగు ద్వారా 532 క్యూసెక్కులు జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. FRL 1493 ఫీట్లు కాగా ప్రస్తుతం 1493.25 ఫీట్ల వద్ద నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ పంట కాలువల ద్వారా 110 క్యూసెక్కుల సాగునీళ్లు వదిలామన్నారు.