KNR: మండలంలోని లింగాపూర్ క్షణికావేశానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన భారతి (52) ఈ నెల 12న కుటుంబసభ్యులతో గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైనా భారతి ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగగా, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.